- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తేవాలి : కడియం శ్రీహరి
దిశ,జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి.ఈ పోటీలను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అడిషనల్ కలెక్టర్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పింకేశ్ కుమార్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ విద్యతో పాటు శారీరక వికాసం కోసం క్రీడలు చాలా అవసరం అన్నారు.మండల స్థాయిలో విజయం సాధించి, జిల్లా స్థాయికి వచ్చిన ప్రతి క్రీడాకారుడిలో ప్రతిభ ఉన్నట్లేనని, జిల్లా స్థాయిలో ఓడినంత మాత్రాన బాధ పడవద్దని, ఓటమి గెలుపుకు నాంది గా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ జనగామ జిల్లా నుంచి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి గ్రామాలలో ఉన్న క్రీడా కారులను గుర్తించాల్సిన బాధ్యత ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుల పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి రాము, జిల్లా విద్యాశాఖ డీసీఈబీ సెక్రెటరీ చంద్రభాను , జిల్లా యువజన, క్రీడా అధికారి వెంకట్ రెడ్డి,స్థానిక కౌన్సిలర్ పాండు , సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జూనియర్ కళాశాల జోనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ త్రీ శ్రీనివాస్, డీసీఈబీ సహాయ కార్యదర్శి రామరాజు తదితరులు పాల్గొన్నారు.