గంజాయి విక్రేత అరెస్ట్..రెండు వాహనాలు స్వాధీనం

by Aamani |   ( Updated:2024-10-18 15:59:42.0  )
గంజాయి విక్రేత అరెస్ట్..రెండు వాహనాలు స్వాధీనం
X

దిశ, శేరిలింగంపల్లి : ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుట్టల బేగంపేట్ నవభారత్‌ నగర్‌ కాలనీలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. బోరబండ ప్రాంతానికి చెందిన పత్తిపాక ప్రభాకర్‌ అనే వ్యక్తి గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారనే సమాచారంతో ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు ఇతర సిబ్బంది దాడులు చేసి పత్తిపాక ప్రభాకర్ అనే వ్యక్తి బైక్‌పై గంజాయి అమ్మకాలు సాగిస్తు ఉండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న గంజాయి, బైక్‌ను పట్టుకొన్నారు. నిందితుడి ఇంట్లో తనిఖీ చేయగా అక్కడ కూడా కొద్దిపాటి గంజాయి మరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద మొత్తంగా 1.897 కేజీల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి పట్టుకున్న టీమ్‌లో ఎస్సై బాలరాజుతోపాటు కానిస్టేబుళ్లు సంతోష్‌, నితిన్‌, సాయి కిరణ్‌, ప్రసన్న, లక్ష్మణ్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్‌సూపరిండెంట్‌ ప్రదీప్‌రావు అభినందించారు.

Advertisement

Next Story