- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గచ్చిబౌలిలో.. ఇంటర్ కాంటినెంటల్ కప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్!
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని హైదరాబాద్ లో గల గచ్చిబౌలి స్టేడియంలో.. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్(4 వ ఎడిషన్) 2024 జరుగుతోంది. అయితే మంగళవారం ఈ ఫుట్ బాల్ కప్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్ లో భారత్, మారిషస్, సిరియా దేశాలు పాల్గొంటున్నాయి. కాగా నేడు భారత్ వర్సెస్ మారిషస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తర్వాత సెప్టెంబర్ 6 వ తేదీన సిరియా వర్సెస్ మారిషస్, సెప్టెంబర్ 9 వ తేదీన భారత్ వర్సెస్ సిరియా మ్యాచ్ లు జరగనున్నాయి.
తెలంగాణలో ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లకు అనుగుణంగా.. గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రభుత్వం పునరుద్దరించింది. అయితే ఈ స్టేడియంలో తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ మరియు ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఫుట్ బాల్ టోర్నీ మ్యాచ్ లు జరగనున్నాయి. కాగా తెలంగాణలో ఇటీవల ఫుట్ బాల్ మ్యాచ్ లకు బాగా ఆదరణ పెరిగిన వేళ, ఫుట్ బాల్ ఆటలను ప్రోత్సహించేందుకు.. ప్రభుత్వం ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ లను సైతం నిర్వహిస్తోంది. ప్రస్తుతం టీజీ లో జరుగుతున్న ఈ మ్యాచ్ ల కారణంగా.. నేడు గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించడం జరిగింది.