- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: పారాలింపిక్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ వేదిక కొనసాగుతోన్న పారాలింపిక్స్-2024 (Paralympics-2024)లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి (Jeevanji Deepti) అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో దీప్తి కాంస్య పతకాన్ని (Bronze medal) కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో దీప్తి 55.82 సెకన్ల సమయంలో రేసును ముగించి బ్రాంజ్ మెడల్‌ను దక్కించుకుంది. తొలి పారాలింపిక్స్‌లోనే దీప్తి పతకాన్ని సాధించడం పట్ల దేశ ప్రజలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పారాలింపిక్స్-2024లో దేశానికి పతకం సాధించి పెట్టిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. ‘పారా లింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి మనందరికీ గొప్ప స్ఫూర్తి’ అని సీఎం ఓ సందేశంలో పేర్కొన్నారు. అదేవిధంగా పారాలింపిక్స్-2024లో మెడల్స్ సాధించిన భారత అథ్లెట్స్, ప్లేయర్స్ అందరికీ సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.