సెరెనాతో పోటీకి సిద్ధంగా ఉన్నా: ఎమ్మా రాడుకాను

by Hajipasha |
సెరెనాతో పోటీకి సిద్ధంగా ఉన్నా: ఎమ్మా రాడుకాను
X

సిన్సినాటి: ఈ నెల 23 నుంచి సిన్సినాటిలో యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. యువ టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకానుతో పోటీపడునున్నారు. అయితే యూఎస్ ఓపెన్ తర్వాత సెరెనా రిటైర్మెంట్ ప్రకటించనున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. అయితే యూఎస్ ఓపెన్‌లో సెరెనా, రాడుకాను వేరే ఆటగాళ్లతో క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఎమ్మా రాడుకాను ఓ ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సెరెనా విలియమ్స్‌తో ఆడేందుకు భయంగా ఉందా? అనే ప్రశ్నకు ఎమ్మా రాడుకాను సమాధానమిచ్చింది. 'సెరెనా విలియమ్స్‌తో పోటీకి సిద్ధంగా ఉన్నాను. ఆమెతో చివరి మ్యాచ్ ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆటలో నేను గెలిచినా.. ఓడినా.. అది నా మధురమైన జ్ఞాపకంగా మారనుంది. 2002లో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్‌గా సెరెనా ఎదిగినప్పుడు నేను పుట్టాను. అప్పటి నుంచి సెరెనా టెన్నిస్ క్రీడలో రాణిస్తున్నారు. అలాంటి స్టార్ ప్లేయర్‌తో చివరి మ్యాచ్ ఆడటం నాకు దొరికిన గొప్ప వరం.' అని అన్నారు.

Advertisement

Next Story