హెడ్ కోచ్ పదవికి క్రిస్ సిల్వర్ వుడ్ రిజైన్

by Hajipasha |
హెడ్ కోచ్ పదవికి క్రిస్ సిల్వర్ వుడ్ రిజైన్
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక క్రికెట్ బోర్డు హెడ్ కోచ్ పదవికి క్రిస్ సిల్వర్ వుడ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలపగా గురువారం లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది.అయితే, టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు చెత్త ప్రదర్శన కనబరిచి కనీసం సూపర్-8కు కూడా చేరుకోలేకపోయిన విషయం తెలిసిందే. లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. అయితే, ఇప్పటికే లంక జట్టు కన్సల్టెంట్‌గా ఉన్న మహేలా జయవర్దనే సైతం తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలోనే సిల్వర్ వుడ్ సైతం తప్పుకోవడం గమనార్హం.

‘అంతర్జాతీయ కోచ్‌గా ఉండటం అంటే.. చాలా కాలం పాటు సొంతవారికి దూరంగా ఉండాలి.కుటుంబంతో చర్చించాకే భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. స్వదేశానికి వెళ్లాల్సిన టైం వచ్చింది. శ్రీలంక క్రికెట్‌లో భాగం కావడం నిజంగా నాకు గర్వకారణం. నేను ఇక్కడ ఎన్నో మధురమైన జ్ఞాపకాలను కూడగట్టుకున్నాను’ అని సిల్వర్ వుడ్ పేర్కొనట్లుగా లంక బోర్బు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా,2022 ఏప్రిల్‌లో శ్రీలంక హెడ్ కోచ్‌గా సిల్వర్ వుడ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed