BWF rankings: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు సాత్విక్ జోడీ..

by Vinod kumar |
BWF rankings: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు సాత్విక్ జోడీ..
X

న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించింది. మూడు స్థానాలు ఎగబాకి 82, 331 పాయింట్లతో 3వ ర్యాంక్‌కు చేరుకుంది. ఆదివారం సాత్విక్ జోడీ ఇండోనేషియా ఓపెన్ టైటిల్ నెగ్గి.. వరల్డ్ టూర్‌లో సూపర్ 1000 టోర్నీ విజేతగా నిలిచిన తొలి భారత జంటగా ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఈ జంట ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా నిలవడంతోపాటు రెండు వరల్డ్ టూర్ టైటిల్స్(స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్) నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు 9వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

అలాగే, మరో ప్లేయర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 18వ ర్యాంక్‌కు చేరుకోగా.. తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ మూడు స్థానాలను వెనక్కినెట్టి 19వ ర్యాంక్‌లో నిలిచాడు. యువ షట్లర్ ప్రియాన్ష్ రజావత్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ 30వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఉమెన్స్ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు రెండు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లో నిలిచింది. అలాగే, ఉమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జంట 16వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-సిక్కిరెడ్డి జోడీ రెండు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌కు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed