- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IND vs PAK : కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. సచిన్‌ను వెనక్కినెట్టాడు

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో 14 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 14,000 రన్స్ పూర్తి చేశాడు. ఫాస్టెస్ట్‌గా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ ఘనత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14 వేల రన్స్ సాధించాడు. కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకుని సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. మొత్తంగా వన్డేల్లో 14,000 రన్స్ చేసిన మూడో బ్యాటర్ కోహ్లీ. వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18,426 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కర 380 ఇన్నింగ్స్‌ల్లో 14,234 రన్స్‌తో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
అజార్దుద్దీన్ రికార్డు కూడా బద్దలు
అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటరే కాదు.. అత్యుత్తమ ఫీల్డర్ కూడా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా ఘనత సాధించాడు. పాక్‌తో మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో ఈ ఫీట్ నెలకొల్పాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నసీమ్ షా ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న కోహ్లీ.. హర్షిత్ రాణా వేసిన ఆఖరి ఓవర్‌లో ఖుష్‌దిల్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకున్నాడు. మొత్తం 299 వన్డే మ్యాచ్‌ల్లో అతను 158 క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత క్రికెటర్ల జాబితాలో కోహ్లీ 156 క్యాచ్‌లతో మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా అజారుద్దీన్‌ను వెనక్కినెట్టాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో కోహ్లీది మూడో స్థానం. శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్ధనే(218) అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్(160) రెండో స్థానంలో ఉన్నాడు. మరో మూడు క్యాచ్‌లు అందుకుంటే కోహ్లీ.. రికీ పాంటింగ్‌ను కూడా వెనక్కినెట్టేస్తాడు.