BWF Rankings: సాత్విక్ ​జోడీ టాప్.. పీవీ సింధుకు మళ్లీ నిరాశే..

by Vinod kumar |
BWF Rankings: సాత్విక్ ​జోడీ టాప్.. పీవీ సింధుకు మళ్లీ నిరాశే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే జరిగిన కొరియా ఓపెన్‌లో టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్స్ సాత్విక్- చిరాగ్​ జోడీ.. తాజాగా మరో అరుదైన రికార్డును అందుకున్నారు. తాజాగా విడుదలైన బీడబ్ల్యూఎఫ్ పురుషుల డబల్స్ ​ర్యాంకింగ్స్‌లోనూ మెరుగుపడింది. ఈ​ర్యాంకింగ్స్‌లో ఈ జోడీ రెండో స్థానంలో నిలిచింది. గత వారం జరిగిన కొరియా ఓపెన్​సెమీ ఫైనల్స్‌లో ఓడిన చైనా జోడీ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌లను.. ఈ ర్యాంకింగ్స్‌లో సాత్విక్​ జోడీ కిందకు నెట్టి ఎగబాకింది.

ప్రస్తుతం సాత్విక్ ​చిరాగ్ ​జోడీ వద్ద 87,211 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మాత్రం గత వారంలాగే ఈ సారి కూడా 17వ స్థానానికే పరిమితమవ్వగా.. సైనా నెహ్వాల్ 37వ స్థానంలో నిలిచింది. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌. ఎస్ ప్రణయ్ 10వ స్థానంలో ఉండగా.. కెనడా ఓపెన్ విజేత లక్ష్య సేన్ ప్రపంచ 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. మరోవైపు కిదాంబి శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed