Organic Farming: యువత కోసం ఆర్గానిక్ ఫార్మింగ్‌లో 3 నెలల శిక్షణ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

by Prasanna |   ( Updated:2024-10-21 11:29:31.0  )
Organic Farming: యువత కోసం ఆర్గానిక్ ఫార్మింగ్‌లో 3 నెలల శిక్షణ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత సమాజంలో కల్తీ లేని కూరగాయలు దొరకాలంటే చాలా కష్టం. పాత కాలంలో రైతులు ఎటువంటి రసాయనాలు వాడకుండా వెజిటేబుల్స్ ను పండించే వాళ్ళు. కానీ, ఇప్పుడు అలా లేదు పంటకు చిన్న పురుగు సోకిన వెంటనే క్రిమిసంహారక మందులను తెచ్చి పిచికారీ చేస్తున్నారు. మళ్ళీ, ఇలాగే వీటిని మార్కెట్ కూడా చేరవేస్తుంటారు. వీటిని మనం తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు రసాయనాలు వాడిన కూరగాయలకు దూరంగా ఉండాలి. కొత్తగా వ్యవసాయం చేద్దామనుకునే యువ రైతులు ఇలాంటి విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి.

యువత స్వయంగా ఎదిగి తన వ్యవసాయాన్ని తానే చేసుకునేందుకు లోతైన అవగాహన, ఆచరణాత్మక శిక్షణను ఇచ్చేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (NAIPHM) ఎన్ఏఐపీహెచ్ఎం 3 నెలల కోర్సును తెలుగు, హిందీ భాషల్లో నిర్వహించనుంది.

ఈ కోర్సులో వందకి వంద శాతం రసాయనాలు లేకుండా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా చేయాలో నేర్పిస్తుంది. నవంబర్ 27 నుంచి 2025 మార్చి 5 వరకు ఈ కోర్సు నిర్వహిస్తారు. దీనిలో 3 దశలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్ఐపీహెచ్ఎం ఆవరణలో శిక్షణ తీసుకోవాలి. ఆ తర్వాత ఎంపికైన వారు ఓ ప్రదేశంలో 2 నెలలు ప్రాజెక్టు చేయాలి. చివరిగా ఎన్ఐపీహెచ్ఎంలో 10 రోజుల శిక్షణ ఉంటుంది. ఇంటర్ , టెన్త్ , వ్యవసాయ డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఈ కోర్సు ఫీజు: రూ.7,500, కోచింగ్ సమయంలో ఉచిత వసతి కల్పించబడుతుంది. పాస్ అయిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులు నవంబర్ 22 లోగా పోస్టు లేదా మెయిల్ ద్వారా పంపాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కోర్సు కోఆర్డినేటర్ డా. కె. దామోదరాచారిని సంప్రదించవచ్చు లేదా ఈమెయిల్ asomicroniphm2019@gmail.com ద్వారా కూడా కాంటాక్ట్ చేయవచ్చు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story