- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్ పవర్‌హౌజ్.. ఆసిస్‌ను హెచ్చరించిన బ్రెట్ లీ
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ సొంత జట్టును హెచ్చరించాడు. టీమిండియా పవర్‌హౌజ్ లాంటిదని, ఏ రోజైనా ఏ జట్టునైనా ఓడించగలదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రెట్ లీ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. ‘ప్రస్తుతం టీమిండియా చాలా శక్తివంతమైనది. ఏ జట్టు ముందు తలవంచదు. విజయం ఎలా సాధించాలో వాళ్లకు తెలుసు. ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో తెలుసు. కివీస్‌పై ఎలా గెలవాలో తెలుసు. ఏ రోజైనా ఏ జట్టునైనా ఓడించగలమని వాళ్లకు తెలుసు.’ అని తెలిపాడు. అలాగే, న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్టు ఓటమిపై స్పందిస్తూ.. భారత ఆటగాళ్లు కొన్ని చెత్త షాట్లు ఆడారని, ఆ ఆటతీరుకు వాళ్లు గర్వపడరని చెప్పాడు.
Advertisement
Next Story