- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఐపీఎల్ బ్లాక్ టికెట్ల వ్యవహారంపై ఎమ్మెల్యే దానం సీరియస్.. సుమోటోగా కేసు నమోదు చేయాలని వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఐపీల్ బ్లాక్ టికెట్ల వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీఏ కాంప్లిమెంటరీ పాసులు పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే బ్లాక్ టికెట్ల దందాకు పోలీసులు వెంటనే చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసలు హెచ్‌సీఏ కరెంట్ బిల్లులు చెల్లించలేని స్థితికి ఎందుకొచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. సన్‌రైజర్స్ టీమ్స్ ఓనర్స్ నుంచే టికెట్లను బ్లాక్లలో అమ్ముకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. బ్లాక్ టికెట్ల మూలాన సామాన్యులు క్రికెట్ మ్యాచ్ చూడలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంప్లిమెంటరీ టికెట్లు రూ.1000 టికెట్‌ను రూ.10 వేలకు, రూ.6 వేల టికెట్ రూ.30 వేలకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని అన్నారు. జెమిని కిరణ్ అనే వ్యక్తికి గుండుగుత్తగా టికెట్లను కట్టబెట్టి బ్లాక్ టికెట్ల దందాకు హెచ్‌సీఏ తెరలేపిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టగానే ఒకేసారి 45 వేలు ఎలా అమ్ముడు అవుతాయని ప్రశ్నించారు. టికెట్లు ఓకేసారి ఏది ఏమైనా పోలీసు డిపార్ట్‌మెంట్ తక్షణమే స్పందించి ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు.