బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ : రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-10 11:03:47.0  )
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ : రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: నాగ్ పూర్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసి తన ఖాతాలో మరో అరుదైన రికార్డు వేసుకున్నాడు. టెస్టుల్లో 9వ శతకం బాదిన రోహిత్ శర్మ తొలి టెస్ట్‌లో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత రోహిత్ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆసీస్ పై రోహిత్ చేసిన ఈ సెంచరీతో అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు శ్రీలంక తరపున తిలకరత్నె దిల్షాన్, సౌత్ ఆఫ్రికా తరపున ఫాఫ్ డుప్లెసిస్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ ఫీట్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో రోహిత్ మొత్తం 43 సెంచరీలు బాదాడు. ఇందులో టీ20ల్లో 4, వన్డేల్లో 30, టెస్టుల్లో 9 ఉన్నాయి.

రవీంద్ర జడేజాపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

Advertisement

Next Story