BIG BREAKING: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. బ్లడ్ క్యాన్సర్‌తో మాజీ క్రికెటర్ కన్నుమూత

by Shiva |
BIG BREAKING: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. బ్లడ్ క్యాన్సర్‌తో మాజీ క్రికెటర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (71) కన్నమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. టీమిండియాకు కోచ్‌గా కూడా పని చేసిన గైక్వాడ్ 1975 నుంచి 1987 వరకు 40 టెస్టులు, 15 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 1,985 పరుగులు సాధించాడు. అయితే, టెస్ట్ ఫార్మాట్‌లో అన్షుమన్ గైక్వాడ్ దాయాది పాకిస్థాన్ జట్టుతో 11 గంటల మారథాన్ ఇన్సింగ్స్ ఆడి 201 పరుగులు సాధించడం ఆయన కెరీర్‌లోనే హైలైట్.

ఇటీవల గైక్వాడ్‌ కేన్సర్‌ చికిత్సకు సంబంధించి ఆర్థిక సమస్యలు రావడంతో వెంటనే ఆదుకోవాలని బీసీసీఐకి కెప్టెన్‌ కపిల్‌‌దేవ్‌ విన్నవించారు. అందుకు స్పందించిన బీసీసీఐ గైక్వాడ్ చికిత్సకు తక్షణం సాయం కింద రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ లోపే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు గైక్వాడ్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. క్రికెట్‌ పట్ల గైక్వాడ్‌‌కు ఉన్న దీక్షా దక్షతలు, క్రికెట్‌కు అందించిన ఎప్పటికీ గుర్తుంటాయిన, ఆయన మరణ వార్త బాధను కలిగిస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా బీసీసీఐ కార్యదర్శి జైషా, మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీతో పాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

Next Story

Most Viewed