- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BGT 2024 : నితీష్ కుమార్ రెడ్డిపై భారత బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కల్ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : భారత బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కల్ ఆల్ రౌండర్ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి తొలి టెస్ట్ పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పెర్త్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోర్కల్ మాట్లాడారు. ఈ సిరీస్‌లో మా దృష్టంతా నితీష్ కుమార్ రెడ్డిపైనే ఉందన్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బూమ్రా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తారని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోర్కల్ నితీష్ రెడ్డి పేరును ప్రముఖంగా ప్రస్తావించాడు. యువ ఆటగాడు నితీష్ ఆలౌ రౌండర్ పాత్ర పోషించే సామర్థ్యం కలిగి ఉన్నాడని తెలిపాడు. తొలి రెండు రోజుల ఆటలో నితీష్ జట్టును టాప్‌లో నిలపగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. నితీష్ రెడ్డి వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయగలడని.. పేసర్లకు సహాయం అందించే ఆల్ రౌండర్లను ప్రపంచంలోని అన్ని జట్లు కోరుకుంటాయన్నాడు. బూమ్రా అతన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాల్సి ఉందన్నాడు. ఐపీఎల్‌లో ఆల్ రౌండర్‌గా అదరగొట్టాడని చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 33.67 యావరేజ్‌తో 303 పరుగులు చేసినట్లు గుర్తు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 21.05 యావరేజ్‌తో 779 పరుగులు చేసి 56 వికెట్లు పడగొట్టాడు. పెర్త్ టెస్టుతో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేస్తాడని ప్రచారం సాగుతుండగా మోర్కల్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.