అబ్బే మనోడు మారడు.. బెన్‌స్టోక్స్ మళ్లీ యూటర్న్!

by saikumar |
అబ్బే మనోడు మారడు.. బెన్‌స్టోక్స్ మళ్లీ యూటర్న్!
X

దిశ, స్పోర్ట్స్ : రిటైర్మెంట్‌పై విదేశీ ఆటగాళ్ల నిర్ణయం పదే పదే మారుతుంటుందని ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.తాజాగా ఇదే విషయాన్ని నిరూపించే ఘటన మరోకటి చోటుచేసుకుంది. ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ బెన్‌స్టోక్స్ తన రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్‌బాల్ క్రికెట్‌లో దేశం తరఫున ఆడాలని సెలక్టర్లు, కోచ్ కోరితే తప్పకుండా ఆడతానని చెప్పారు. అయితే, 2022లో స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2023 వరల్డ్ కప్‌లో పునరాగమనం చేసి మళ్లీ రిటైర్మెమెంట్ ప్రకటించాడు.

తాజాగా మరోసారి వన్డేలు, టీ20ల్లో పునరాగమనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 33 ఏళ్ల స్టోక్స్‌ ఫిట్‌నెస్‌ పరంగానూ నిరూపించుకోలేకపోతున్నాడు. కేవలం టెస్ట్‌ల్లో మాత్రమే బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. బౌలింగ్‌ చేసినా అంతంత మాత్రమే. ఈ టైంలో అతను తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. టెస్టుల్లో మాత్రం అతనో కింగ్ మేకర్ అని కూడా చెప్పలేము.కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం జట్టును ఆదుకునే సత్తా అతనిలో ఉంది. కాగా, స్టోక్స్‌ ఇంగ్లండ్‌ తరఫున 105 టెస్ట్‌లు 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. ప్రస్తుతం బ్రెండన్ మెక్‌ కల్లమ్‌ ఇంగ్లండ్‌ ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడైన తర్వాత స్టోక్స్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story