ధోని ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన బెన్ స్టోక్స్

by Mahesh |   ( Updated:2023-07-10 05:07:51.0  )
ధోని ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన బెన్ స్టోక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆదివారం ధోని ప్రపంచ రికార్డున బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 250 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేజ్ చేసింది. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక విజయవంతమైన 250-ప్లస్ పరుగుల ఛేజింగ్‌కు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా స్టోక్స్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఇది వారికి అతని కెప్టెన్సీలో ఇంగ్లాండ్ ఐదో విజయవంతమైన 250-ప్లస్ పరుగుల ఛేజింగ్‌గా గుర్తించబడింది. టెస్టు క్రికెట్‌లో భారత్‌ను నాలుగు 250-ప్లస్ రన్ ఛేజింగ్‌లకు నడిపించిన ఎంఎస్ ధోని గతంలో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

Advertisement

Next Story