ఈ నెల 27న బీసీసీఐ స్పెషల్ మీటింగ్!

by Javid Pasha |
ఈ నెల 27న బీసీసీఐ స్పెషల్ మీటింగ్!
X

న్యూఢిల్లీ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-16 ముగిసిన వెంటనే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ, బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్‌ను నిర్వహించనుంది. ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్ ఈ నెల 28న అహ్మదాబాద్ వేదికగా జరగనుండగా.. ఒక రోజు ముందు అహ్మదాబాద్‌లో ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రెటరీ జైషాతోపాటు సీనియర్స్ అఫీషియల్స్ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌లో ఐదు అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా వరల్డ్ కప్ సన్నాహాలపైనే సమావేశం జరగనుంది.

వరల్డ్ కప్ వేదికల ఖరారుతోపాటు వరల్డ్ కప్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కమిటీ ఏర్పాటు, మౌళిక సదుపాయాలు మరియు సబ్సిడీ కమిటీ ఏర్పాటు, రాష్ట్ర జట్లలో ఫిజియోథెరపిస్ట్‌లు, ట్రైనర్స్ నియామకాల కోసం గైడ్‌లైన్స్‌పై చర్చించనున్నారు. లైంగిక వేధింపులపై ఇంటర్నెల్ కమిటీ లేకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇటీవల బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల నిరోధక విధానంపై చర్చ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed