వరుసగా మూడోసారి ఏసీసీ ఛైర్మన్ గా జైషా

by Shamantha N |
వరుసగా మూడోసారి ఏసీసీ ఛైర్మన్ గా జైషా
X

దిశ, స్పోర్ట్స్: వరుసగా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియామకం అయ్యాడు జైషా. బాలిలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జైషా ఏసీసీ అధ్యక్ష పదవీ కాలాన్ని పొడగిస్తూ ప్రతిపాదన తెచ్చారు శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమి సిల్వా. ఏసీసీ సభ్యులందరూ జైషా నామినేషన్ ను ఏకగ్రీవంగా సమర్థించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తర్వాత ఏసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు జైషా. 2021 జనవరిలో తొలిసారిగా ఏసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జైషా ఆధ్వర్యంలో ఆసియా కప్ ను 2022లో టీ20, 2023లో వన్డే కప్ ను విజయవంతంగా నిర్వహించింది.

తనపై నమ్మకముంచిన ఏసీసీ బోర్డుకి ధన్యవాదాలు తెలిపారు జైషా. ఆసియా వ్యాప్తంగా క్రికెట్ విస్తరించేందుకు ఏసీసీ కృషి చేస్తుందన్నారు. క్రీడలు ఇంకా అభివృద్ధి చెందని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి.. సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉంటామ్ననారు.

జై షా మార్గదర్శకత్వంలోనే బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక క్రికెట్ లో కొత్త ప్రతిభను వెలికితీసి.. ప్రోత్సహించడంతో ఏసీసీ కీలక పాత్ర పోషించిందన్నారు సిల్వా. ఏసీసీ ఉపాధ్యక్షుడు, ఒమన్ క్రికెట్ ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీ జైషాకు అభినందనలు తెలిపారు. ఏసీసీ టోర్నమెంట్ లల్లో పెట్టుబడి పెట్టేందుకు వాటాదారులు ముందకొస్తున్నారని.. ఇది ఆట వృద్ధికి తోడ్పడుతుందన్నారు ఖిమ్జీ. జైషా ఆధ్వర్యంలో ఆసియా క్రికెట్ అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు హసన్. ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏసీసీతో కలిసి పనిచేయాలన్నారు.

Advertisement

Next Story