- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైజాగ్‌లో టెస్టు మ్యాచ్‌కు విశేష ఆదరణ : బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ
దిశ ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీడీ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఆదివారం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ హాజరయ్యారు. అంతకుముందు స్టేడియంలో బీసీసీఐ జెండాను రోజర్ బిన్నీ, ఏసీఏ జెండాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మ్యాచ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. టెస్టు మ్యాచ్ కోసం వైజాగ్‌లో వచ్చినంత మంది ప్రేక్షకులను దేశంలో ఎక్కడా చూడలేదని అన్నారు. వైజాగ్‌లో ఆశేష ప్రేక్షకులను చూస్తుంటే టెస్టులకు పూర్వ వైభవం రాబోతోందని చెప్పారు. భవిష్యత్తులో టెస్టు మ్యాచ్‌లు ప్రజల ఆదరణ, అభిమానాన్ని చూరగొంటాయని, అందుకు వైజాగ్‌లో నిర్వహించిన టెస్టు మ్యాచే ఉదాహరణ అని అన్నారు. మ్యాచ్ నిర్వహణ కోసం ఏసీఏ చేసిన ఏర్పాట్లు, పలు కార్యక్రమాల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. రోజర్ బిన్నీ వెంట ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ వి. చాముండేశ్వరి నాథ్, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ జితేంద్రనాథ్ శర్మ, ఏసీఏ సీఈఓ డాక్టర్ ఎం.వి. శివారెడ్డి, తదితరులు ఉన్నారు.