క్రికెట్ మీడియా హక్కులకు టెండర్.. రేపు ప్రారంభించనున్న బీసీసీఐ

by Vinod kumar |
క్రికెట్ మీడియా హక్కులకు టెండర్.. రేపు ప్రారంభించనున్న బీసీసీఐ
X

ముంబై: 2023-27 మధ్య కాలంలో క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన మీడియా హక్కుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎట్టకేలకు టెండర్లను పిలవాలని నిర్ణయించింది. టెండర్ ప్రక్రియను బీసీసీఐ భాగస్వామి ఎర్నెస్ట్ అండ్ యంగ్ మంగళవారం ప్రకటిస్తుంది. కొత్త బ్రాడ్ కాస్టర్ ప్రపంచ కప్-2023కు ముందు భారత్, ఆస్ట్రేలియాల మధ్య వన్డే సిరీస్‌తో పని ప్రారంభిస్తుంది. దీంతో హక్కుల విక్రయ ప్రక్రియ ఆగస్టు 19వ తేదీ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

కొత్త డీల్ ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. యాక్షన్ విధానం ఎలా ఉంటుందో బ్రాడ్ కాస్టర్లకు ఇంకా వెల్లడించలేదు. అయితే.. ఈ-వేలం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ మీడియా హక్కులను ఈ-వేలం ద్వారా విక్రయించడం ద్వారా బీసీసీఐ రికార్డు స్థాయిలో రూ.48,390 కోట్లు సంపాదించింది.

- కొత్త ఒప్పందం ఐపీఎల్‌లో మాదిరిగా ఐదేళ్లు కొనసాగుతుంది.

- డిజిటల్ మీడియాకు ఆదరణ ఎక్కువగా ఉన్నందున డిజిటల్, టీవీ హక్కులు రెండూ వేర్వేరుగా ఉంటాయి.

- క్లోజ్డ్ బిడ్డింగ్ ప్రక్రియకు బదులుగా ఈ-వేలం నిర్వహించే అవకాశం ఉంది.

- ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి రూ.48,390 కోట్లు వచ్చాయి. దీనికి టీవీ హక్కులు, డిజిటల్ హక్కులు వేర్వేరుగా ఉన్నాయి.

- కొత్త ఒప్పందంలో ఎన్ని మ్యాచ్‌లు ఉంటాయన్న విషయం ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది.

- ఈ ఒప్పందంలో 100 ముఖాముఖి మ్యాచ్‌లు ఉండే అవకాశం ఉంది.

- క్రికెట్ ప్రేమికుల్లో వన్డేలపై ఆసక్తి తగ్గడంతో కొత్త ఒప్పందంలో టీ20 మ్యాచ్‌లు ఎక్కువగా, వన్డే మ్యాచ్‌లు తక్కువగా ఉంటాయి.

- డిస్నీ-స్టార్ చివరి సారిగా 103 మ్యాచ్‌లకు రూ.6138.10 కోట్లు చెల్లించింది. ఒక్కో మ్యాచ్ విలువ రూ.61 కోట్లు. అయితే.. ఈసారి హక్కులు డిజిటల్‌కు, టీవీకి వేర్వేరుగా ఉండటంతో బీసీసీఐ రూ.12,000 కోట్లకు పైగా ఆశిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed