- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ అభిమానులకు పండగే.. హైదరాబాద్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు..!
దిశ, వెబ్‌డెస్క్: 2023 సంవత్సరం చివర్లో ODI ప్రపంచకప్ భారత్ వేదికగా జరుగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ మ్యాచులు నిర్వహించేందుకు 12 నగరాలను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై నగరాలు ఉన్నాయి. హైదరబాద్‌లో కూడా ఖచ్చితంగా మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రికెట్ అభిమానుల కోరిక తీరనుంది.
వరల్డ్ కప్ మ్యాచ్ చూడటం కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతగానో వేచి చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ లో బాగంగా ఉప్పల్ స్టేడియంలో దాదాపు 5 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తుంది. దీనికి తోడు వరల్డ్ కప్ మ్యాచులు చూసే అవకాశం దక్కుతుంది. కాగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం.