వెస్టిండీస్ టూర్‌.. టీమ్ ఇండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ

by Vinod kumar |
వెస్టిండీస్ టూర్‌.. టీమ్ ఇండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‍లకు భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. జూలై 12న వెస్టిండీస్‍తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. జూలై 27న మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు సిరీస్‍లకు రోహిత్ శర్మ కెప్టెన్‍గా ఉన్నాడు. భారత నయా వాల్ చతేశ్వర్ పుజారాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇటీవలే టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన అజింక్య రహానే టెస్టుల్లో మళ్లీ వైస్ కెప్టెన్ పోస్టును సొంతం చేసుకున్నాడు.

యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్‌కు రెండు జట్లలో చోటు దక్కింది. వన్డే టీమ్‍లోకి సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇవ్వగా.. యువ సంచలనం యశస్వి జైస్వాల్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చారు సెలెక్టర్లు. అతడి స్థానంలో పేసర్ నవ్ దీప్ సైనీకి టెస్టుల్లో చోటు దక్కింది. మరో పేసర్ జయదేవ్ ఉనాద్కత్ కూడా మళ్లీ వచ్చేశాడు.

టెస్ట్ స్క్వాడ్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (విసి), కెఎస్ భరత్ (వికె), ఇషాన్ కిషన్ (వికె), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , Mohd. సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

భారత వన్డే జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా (VC), శార్దూల్ ఠాకూర్, R జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.


Advertisement

Next Story

Most Viewed