Jatara: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్న ‘జాతర’

by sudharani |   ( Updated:2024-10-25 14:59:02.0  )
Jatara: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్న ‘జాతర’
X

దిశ, సినిమా: ప్రజెంట్ ఇండస్ట్రీ (Industry)లోకి కొత్త తరం వచ్చి బాక్సాఫీస్ (box office) వద్ద మంచి విజయాలను అందుకుంటున్నారు. దర్శకత్వం, రైటర్, హీరోగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ టాలెంట్ (talent)ను చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో కొత్త టీం ‘జాతర’ (Jatara) అనే చిత్రంతో ఇప్పుడు ఇండస్ట్రీలోకి రాబోతుంది. సతీష్ బాబు రాటకొండ (Satish Babu Ratakonda) నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమాను గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. అంతే కాకుండా.. ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ (First Look) అందరినీ ఆకట్టుకోగా.. పాజిటివ్ (Positive) అంచనాల మధ్య ఈ మూవీ నవంబర్ (November) 8న థియేటర్లోకి రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు చిత్ర బృందం (movie team). కాగా.. చిత్తూరు జిల్లాలో జరిగే జాతర బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ‘జాతర’ చిత్రంలో దీయా రాజ్ (Diya Raj) హీరోయిన్‌గా నటించగా.. ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు.

Advertisement

Next Story