- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘స్పిన్ సర్వ్’పై బీడబ్ల్యూఎఫ్ తాత్కాలిక నిషేధం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ఇటీవల తీవ్ర చర్చకు దారితీసిన ‘స్పిన్ సర్వ్’పై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) గవర్నింగ్ బాడీ శుక్రవారం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే సుదీర్మాన్ కప్‌తోపాటు అన్ని బీడబ్ల్యూఎఫ్ టోర్నీల్లో ఈ తాత్కాలిక నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. మే 29 వరకు నిషేధం కొనసాగుతుందని, తదుపరి సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఈ సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ పౌల్-ఎరిక్ హోయర్ మాట్లాడుతూ.. బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్‌తో సహా బ్యాడ్మింటన్ కమ్యూనిటీ నుంచి చాలా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, అన్ని నివేదకలు స్పిన్ సర్వ్ ఆటపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించినట్టు తెలిపారు.
అలాగే, అనుమతించబడని ‘సిడెక్ సర్వ్’తో స్పిన్ సర్వ్‌కు సారూప్య లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కాగా, గత నెలలో జరిగిన పొలిష్ ఓపెన్‌లో డెన్మార్క్ డబుల్స్ ప్లేయర్ మార్కస్ రిండ్‌షోజ్ తొలిసారిగా స్పిన్ సర్వ్‌ను ఉపయోగించాడు. స్పిన్ సర్వ్‌తో అతను ఎక్కువ పాయింట్స్ సాధించడంతో ఒక్కసారిగా ఆ సర్వ్ ఆటగాళ్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, స్పిన్ సర్వ్ చేయడం ద్వారా షటిల్ కాక్ గింగిరాలు తిరగడంతో ప్రత్యర్థి ఆటగాడు దాన్ని సరిగ్గా ఆడలేకపోతారు. ఇది ఆటగాళ్లకు నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.