తొలి రౌండ్‌లో ఇండియాకు నిరాశ.. లక్ష్యసేన్ ఔట్

by Vinod kumar |
తొలి రౌండ్‌లో ఇండియాకు నిరాశ.. లక్ష్యసేన్ ఔట్
X

ముల్హీమ్ (జర్మనీ): జెర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ఆటగాడు లక్ష్య సేన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ వరుస సెట్లలో క్రిస్టో పొపోవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. భారత 12వ ర్యాంక్ ఆటగాడు, ఈ టోర్నీలో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన లక్ష్యసేన్‌పై 18-21, 16-21తో ఫ్రెంచ్ షట్లర్ పొపోవ్ విజయం సాధించాడు. పొపోవ్‌పై గతంలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన లక్ష్యసేన్ ఈ టోర్నీలోనూ గెలుస్తాడని అందరూ ఆశించారు.

కానీ మ్యాచ్ ఆరంభం నుంచే పొపోవ్ బలంగా ఆడాడు. తొలి గేమ్ విశ్రాంతి సమయానికి పొపోవ్ 11-7 ఆధిక్యంతో నిలిచాడు. అయితే సేన్ పుంజుకుని 19-17 ఆధిక్యం సంపాదించాడు. కానీ, పొపోవ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్ ఈ ఫ్రెంచ్ ఆటగాడికి నల్లేరు మీద నడకలా సాగింది. ఆరంభంలోనే వరుసగా ఐదు పాయింట్లు సాధించి సేన్ మీద ఒత్తిడి తెచ్చాడు. అయితే భారతీయ షట్లర్ నిదానంగా గేమ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించాడు. కానీ పొపోవ్ రెండో గేమ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.


Advertisement

Next Story