IDNvsAUS: రేపు మ్యాచ్‌కు వెళ్లే వారు బకెట్ నీళ్లు తీసుకెళ్లండి!

by GSrikanth |   ( Updated:2022-10-26 14:03:02.0  )
IDNvsAUS: రేపు మ్యాచ్‌కు వెళ్లే వారు బకెట్ నీళ్లు తీసుకెళ్లండి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేపు ఉప్పల్ స్టేడియంలో దాదాపు రెండేళ్ల తర్వాత జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లలో మాత్రం అడుగడునా హెచ్‌సీఏ వైఫల్యం చెందుతుంది. గత రెండు రోజులుగా టిక్కెట్ల కోసం అభిమానులు లాఠీఛార్జీ, తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. అయినా కూడా హెచ్‌సీఏ ఏర్పాట్లలో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ స్టేడియంలోని సీటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సీట్లన్నీ పావురాల మలంతో అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వేల రూపాయలు ఖర్చు చేసి ఈ సీట్లలో కూర్చోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. మరోవైపు రేపు 'మ్యాచ్ టికెట్లు ఉన్నవాళ్లు రెండు బకెట్ల నీళ్లు, ఇంత సర్ఫ్ తీసుకెళ్లండి.. మీరే కడుక్కుని కూర్చోవాలి' అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తు్న్నారు. ప్రస్తుతం దీనికి సంభందించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story