- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిక్కుల్లో అయ్యర్!.. గాయం సాకుతో దేశవాళీకి దూరం?
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చిక్కుల్లో పడేలా ఉన్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపిక కానప్పుడు ఫిట్‌గా ఉంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, గాయం సాకుతో అయ్యర్ దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల తర్వాత వెన్ను నొప్పి కారణంగా సెలెక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. తొలి రెండు టెస్టుల్లో వైఫల్యం కారణంగానే అయ్యర్‌ను తప్పించారని వార్తలొచ్చాయి. పునరావాసం కోసం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ ఆడలేనని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలిపాడు. దీంతో శుక్రవారం బరోడాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు, అయ్యర్ ఫిట్‌గానే ఉన్నాడని ఎన్‌సీఏ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసన్ హెడ్ నితిన్ పటేల్ సెలెక్టర్లకు మెయిల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ‘రెండో టెస్టు తర్వాతనే శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడు. సెలెక్షన్‌కు కూడా అందుబాటులోకి వచ్చాడు. జట్టు నుంచి వైదొలిగిన తర్వాత అతనికి కొత్త గాయాలు లేవు.’అని నితిన్ పటేల్ సెలెక్టర్లకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీంతో అయ్యర్ కావాలనే రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నాడని, ఐపీఎల్ కోసం బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. మరి, దీనిపై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.