ICC Test Rankings : 6 స్థానాలు కోల్పోయిన బాబర్.. కోహ్లీ, జైశ్వాల్ ర్యాంక్‌లు మెరుగు

by Harish |
ICC Test Rankings : 6 స్థానాలు కోల్పోయిన బాబర్.. కోహ్లీ, జైశ్వాల్ ర్యాంక్‌లు మెరుగు
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు.బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్‌ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ బ్రూక్ మూడు స్థానాలు ఎగబాకి 4వ స్థానానికి చేరుకున్నాడు. ఇక, భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, కోహ్లీ టాప్-10లో ఉన్నారు. రోహిత్ 6వ స్థానాన్ని కాపాడుకోగా.. జైశ్వాల్ ఒక్క స్థానాన్ని వెనక్కినెట్టి 7వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కోహ్లీ రెండు స్థానాలు అధిగమించి 8వ ర్యాంక్‌లో నిలిచాడు.

పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయి 9వ ర్యాంక్‌కు పడిపోయాడు. రిజ్వాన్ 7 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి ప్రవేశించాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ టాప్ బౌలర్‌గా ఉండగా.. బుమ్రా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. జడేజా 7వ స్థానాన్ని కాపాడుకోగా.. కుల్దీప్ 14వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాలను పదిలం చేసుకోగా.. అక్షర్ పటేల్ 6వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

Advertisement

Next Story