రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

by GSrikanth |
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాకు మార్ష్ 2022లో ప్రతిష్టాత్మక షెఫీల్డ్ ట్రోఫీని సారథిగా అందించారు. ఇక మార్ష్ అంతర్జాతీయ కెరియర్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా తరపున 38 టెస్టు మ్యాచులు ఆడి 6 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు, 2773 పరుగులు చేశాడు. 73 వన్డే మ్యాచులు ఆడి 2773 పరుగులు చేశాడు. 15 టీ20లు ఆడిన మార్ష్ కేవలం 255 పరుగులు మాత్రమే చేశారు. కాగా, షాన్ మార్ష్ సోదరుడు మిచెల్ మార్ష్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కొనసాగుతున్నారు.

Advertisement

Next Story