- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు మెద్వెదేవ్.. ఈ సారైనా టైటిల్ దక్కేనా?
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండుసార్లు ఫైనల్‌కు చేరి తృటిలో టైటిల్ కోల్పోయిన వరల్డ్ నం.3 డేనియల్ మెద్వెదేవ్ ఈ సారి టైటిలే లక్ష్యంగా టోర్నీలో అడుగుపెట్టాడు. ఆ దిశగా అడుగులు వేసిన అతను మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో జర్మనీ ఆటగాడు, 6వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై అద్భుత విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 5-7, 3-6, 7-6(7-4), 7-6(7-5), 6-3 తేడాతో పోరాడి గెలిచాడు. 4 గంటల 18 నిమిషాలపాటు మ్యాచ్ జరిగింది. తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత మెద్వెదేవ్ పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ప్రత్యర్థి దూకుడును అడ్డుకున్న అతను మూడో సెట్‌ను టై బ్రేకర్‌లో దక్కించుకుని పోటీలోకి వచ్చాడు. నాలుగో సెట్ కూడా టై బ్రేకర్‌కు వెళ్లగా అక్కడ మెద్వెదేవ్ పైచేయి సాధించాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదు సెట్‌కు మళ్లింది. ఐదు సెట్‌ను కూడా రసవత్తరంగానే సాగగా.. 5వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయడం ద్వారా మెద్వెదేవ్ పట్టు సాధించాడు. అనంతరం సర్వీస్‌లను కాపాడుకుని ఆధిక్యం కొనసాగించిన అతను 9వ గేమ్‌లో మరోసారి బ్రేక్ పాయింట్ పొంది విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. దీంతో మూడోసారి ఆస్టేలియన్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. గతంలో 2021, 2022 వరుసగా రెండు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరిన అతను రన్నరప్‌గా సరిపెట్టాడు. 2021లో యూఎస్ ఓపెన్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన అతను రెండో గ్రాండ్‌స్లామ్ నిరీక్షణకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెరదించుతాడో లేదో చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో 4వ సీడ్ జెన్నిక్ సిన్నర్‌తో మెద్వెదేవ్ తలపడనున్నాడు.