WTC: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ ఔట్

by GSrikanth |
WTC: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరిన ఇండియా జట్టు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే ఎలాగైనా ఈ కప్పుని గెలవాలని వ్యూహాలు రెడీ చేస్తున్నాడు. ఇక మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఇంగ్లండ్ చేరుకొని ఫైనల్ కోసం తెగ కసరత్తులు చేస్తుంది. రెండు జట్లు కూడా ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ట్రోఫీ అందుకోవాలని చాలా తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనబడుతోంది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ బౌలర్ హేజిల్‌వుడ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో పేసర్ మైకెల్ నెసర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ఆసీస్ బోర్డు ప్రకటిచించింది. కాగా, ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడిన హేజిల్‌వుడ్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగి మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇంతకాలం టెస్ట్ చాంపియన్ షిప్‌ కోసం కసరత్తు చేసిన ఆయన మళ్లీ గాయం కారణంగా ఏకంగా మ్యాచ్ నుంచే దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి.

Advertisement

Next Story