కుప్పకూలిన ఆస్ట్రేలియా.. 177 పరుగులకే ఆలౌట్

by Mahesh |   ( Updated:2023-02-09 09:33:39.0  )
కుప్పకూలిన ఆస్ట్రేలియా.. 177 పరుగులకే ఆలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో.. ఆల్ రౌండర్ జడేజా అశ్విన్‌లు రెచ్చిపోయారు. మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే సీరాజ్ రూపంలో షాక్ తగిలింది. కేవలం రెండు పరుగులకే ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయ్యారు. అనంతరుం మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్ 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

అనంతరం జడేజా మంచి ఫామ్ లో ఉన్న మార్నస్ లాబుస్చాగ్నే, స్మిత్ లను వెంట వెంటనే అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం ఆల్ రౌండర్ అశ్విన్.. జడేజాకు తోడుగా మరో మూడు వికెట్లు తీయడం తో ఆస్ట్రేలియా జట్టు 63.5 ఓవర్లకు 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో జడెజా... 22 ఓవర్లకు 5 వికెట్లు తీశాడు.

Advertisement

Next Story