- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెలరేగిన ఆసీస్ ఓపెనర్లు.. టీమ్ ఇండియాపై ఆసీస్ గ్రాండ్ విక్టరీ
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఓపెనర్లు చెలరేగడంతో.. వికెట్ నష్టపోకుండా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (66), మరో ఓపెనర్ హెడ్ (51) పరుగులతో చెలరేగారు. దీంతో 3 వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మిచెల్ స్టార్క్(5/53), సీన్ అబాట్(3/23), నాథన్ ఎల్లిస్(2/13) దెబ్బకు టీమిండియా 26 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది.
విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 4 ఫోర్లతో 31), అక్షర్ పటేల్(29 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఫస్ట్ ఓవర్ మూడో బంతికి గిల్ క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీతో రోహిత్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు. వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ, మిచెల్ స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్(13), సూర్య(0)ను ఔట్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు. చివరి వన్డే మార్చి 22 న జరగనుంది.
WHAT. A. PERFORMANCE 👊
— ICC (@ICC) March 19, 2023
Australia level the ODI series after a comfortable victory in Visakhapatnam! #INDvAUS | 📝 Scorecard: https://t.co/5ISBBNMhiZ pic.twitter.com/WXwrt4FXzl