- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: మూడో వన్డేలో ఆసీస్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న చివరి వన్డేలో ఆసీస్ 269 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసింది. 49 ఓవర్లో ఆలౌట్ అయిన కంగారులు.. 269 పరుగులు చేశారు. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ 47, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 33, డేవిడ్ వార్నర్ 23, లబుషేన్ 28, ఆలెక్స్ క్యారీ 38, స్టోయినిస్ 25, బౌలర్ సీన్ అబాట్ 26 పరుగులు చేయడంతో పోరాడే స్కోర్ చేసింది.
కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్కిప్పర్ స్మిత్ తీవ్ర నిరాశ పర్చాడు. కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న స్మిత్ హర్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక, భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదక్ చెరో మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 270 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. ఇక మూడు వన్డేలో సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలో చెరో విజయం సాధించడంతో.. ఈ చివరి వన్డేపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.