- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AUS VS PAK : ఆసిస్ చేతిలో పాక్ చిత్తు.. కీలక ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు షాక్ తగిలింది. నాయకత్వం వహించిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సోమవారం జరిగిన తొలి వన్డేలో 2 వికెట్ల తేడాతో పాక్‌ను ఆసిస్ చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్.. ఆసిస్ బౌలర్ల ధాటికి 46.4 ఓవర్లలోనే కుప్పకూలింది. 203 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రిజ్వాన్(44), నసీమ్ షా(40), బాబర్ ఆజామ్(37) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఆసిస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు, కమిన్స్, జంపా రెండేసి వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం 204 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ఆసిస్ చెమటోడ్చింది. 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోష్ ఇంగ్లిస్(49), స్మిత్(44) రాణించగా.. మిగతా వారు విఫలమవడంతో ఆసిస్ ఒక దశలో 185/8తో ఓటమి అంచున నిలిచింది. ఈ పరిస్థితుల్లో పాట్ కమిన్స్(32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. దీంతో పాక్ బౌలర్ల శ్రమ ఫలించలేదు. ఈ విజయంతో ఆసిస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శుక్రవారం రెండో వన్డే జరగనుంది.