Australia vs England: ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లాండ్.. రెండో T20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం

by Maddikunta Saikiran |
Australia vs England: ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లాండ్.. రెండో T20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: కార్డిఫ్(Cardiff) వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్(England) మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.దీంతో మొదటి టీ20లో ఆసీస్ చేతిలో ఎదురైనా పరాభవానికి ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. కాగా 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది.ఇంగ్లాండ్ బ్యాటర్లలో లివింగ్ స్టన్(Livingstone) 87 (47 బంతుల్లో), బెథెల్(Bethell) 44 (24 బంతుల్లో) పరుగులు చేసి రాణించారు.సాల్ట్(Salt) 39 పరుగులు చేశాడు.ఆసీస్ బౌలర్లలో షార్ట్(Short) ఒక్కడే 5 వికెట్లు సాధించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 194 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.ఆసీస్ టీంలో జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్(Jake Fraser-McGurk) 50 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో ఆరోన్ హార్డీ(Aaron Hardie) 9 బంతుల్లో 20 పరుగులతో రాణించడంతో ఆసీస్ 193 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టన్,కార్సే(Carse) తలో రెండు వికెట్లు పడగొట్టారు.ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న లివింగ్ స్టన్ కు 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.కాగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలవగా తాజాగా ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమమయ్యింది. సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్‌ మాంచెస్టర్(Manchester) వేదికగా ఆదివారం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed