Australia vs England:ఆసీస్‌తో మొదటి టీ20 కోసం తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

by Maddikunta Saikiran |
Australia vs England:ఆసీస్‌తో మొదటి టీ20 కోసం తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
X

దిశ, వెబ్‌డెస్క్:ఆస్ట్రేలియా(Australia)- ఇంగ్లాండ్(England) మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది.కాగా కాలి కండరాల గాయంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే వన్డే సిరీస్‌లో కూడా బట్లర్ ఆడటం అనుమానంగా మారింది.అతని స్థానంలో ఇంగ్లాండ్ యాజమాన్యం ఫిల్ సాల్ట్‌(Phil Salt)ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.కాగా టీ20 సిరీస్ కు బట్లర్ స్థానంలో ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను జట్టులోకి తీసుకుంది.సెప్టెంబర్‌ 11, 13, 15 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ లు జరుగనున్నాయి.ఇదిలా ఉంటే మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా రేపు జరగబోయే తొలి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టుని ప్రకటించారు. ఈ మ్యాచులో ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జేకబ్ బేథేల్(Jacob Bethell),జేమీ ఓవర్టన్‌(Jamie Overton),జోర్డాన్ కాక్స్(Jordan Cox) ఆరంగ్రేటం చేయనున్నారు.

ఆసీస్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లాండ్ తుది జట్టు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్‌), విల్ జాక్స్, జోర్డాన్ కాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెథెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లే

కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది.

ఆసీస్‌, ఇంగ్లండ్‌ మధ్య T20, ODI సిరీస్‌ షెడ్యూల్‌..

సెప్టెంబర్‌ 11- మొదటి T20 (సౌతాంప్టన్‌)

సెప్టెంబర్‌ 13- రెండో T20 (కార్డిఫ్‌)

సెప్టెంబర్‌ 15- మూడో T20 (మాంచెస్టర్‌)

సెప్టెంబర్‌ 19- మొదటి ODI (నాటింగ్హమ్‌)

సెప్టెంబర్‌ 21- రెండో ODI (లీడ్స్‌)

సెప్టెంబర్‌ 24- మూడో ODI (చెస్టర్‌ లీ స్ట్రీట్‌)

సెప్టెంబర్‌ 27- నాలుగో ODI (లండన్‌)

సెప్టెంబర్‌ 29- ఐదో ODI (బ్రిస్టల్‌)

Advertisement

Next Story