చాంపియన్స్ ట్రోఫీ ఆడాలనుకున్న వార్నర్‌కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా

by Harish |
చాంపియన్స్ ట్రోఫీ ఆడాలనుకున్న వార్నర్‌కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టీ20 వరల్డ్ కప్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. కానీ, ఇటీవల వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. కానీ, వార్నర్‌కు తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షాకిచ్చింది. చాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికల్లో వార్నర్ లేడని క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు.

‘వార్నర్ రిటైర్ అయ్యాడనే మేము భావిస్తున్నాం. మూడు ఫార్మాట్లలో అతని అద్భుతమైన కెరీర్‌‌ను మెచ్చుకోవాలి. చాంపియన్స్ ట్రోఫీ కోసం మేము అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు.’ అని తెలిపాడు. జార్జ్ బెయిలీ‌ వ్యాఖ్యలను బట్టి చాంపియన్స్ ట్రోఫీ ఆడాలన్న వార్నర్ కల చెదిరినట్టే అని అర్థమవుతుంది. మరోవైపు, సెప్టెంబర్‌లో ఆసిస్ జట్టు స్కాట్లాండ్, ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం టీ20, వన్డే జట్లను ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌‌ను దూరం పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed