100 టెస్టుల గుర్తుగా పూజారాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఆస్ట్రేలియా..

by Mahesh |   ( Updated:2023-02-21 05:04:33.0  )
100 టెస్టుల గుర్తుగా పూజారాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టెస్ట్ ప్రేయర్ చెతేశ్వర్ పుజారాకు ఆస్ట్రేలియా జట్టు బహుమతిని ఇచ్చింది. పుజారా 100వ టెస్టు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్ట్రేలియా జట్టు మొత్తం సంతకాలు చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చింది. దినిని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అందజేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో క్రికెట్ అభిమానులు ఆస్ట్రేలియా జట్టుపై ప్రసంశలు కురిపిస్తున్నారు. కాగా "స్పిరిట్ ఆఫ్ క్రికెట్... వాట్ ఎ స్పెషల్ హావభావాలు!" అని బీసీసీఐ రాసింది. "అన్ని గొప్ప యుద్ధాలకు ధన్యవాదాలు" అని జెర్సీపై వచనం ఉంది.

Advertisement

Next Story