- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WTC Final 2023: ఆ జట్టే టైటిల్ ఫేవరేట్.. పాక్ లెజెండ్
దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లోని ఓవల్ వేదికగా బుధవారం (జూన్ 7-11) నుంచి ప్రారంభం కానున్న WTC ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్‌లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే భారత్ కంటే ఆస్ట్రేలియాకే ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఓవల్‌లో విపరీతమైన స్వింగ్, బౌన్స్ ఉంటుందని, ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొవడం టీమిండియా బ్యాటర్ల వల్ల కాదన్నాడు. భారత బౌలింగ్ ఎటాక్ ఆస్ట్రేలియాతో పోలిస్తే కాస్త వీక్‌గా ఉంది. నా వరకు అయితే ఆస్ట్రేలియానే టైటిల్ ఫేవరేట్ అని అక్రమ్ పేర్కొన్నాడు.
ఓవల్‌లో సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమవుతాయి. అప్పుడు పిచ్ డ్రైగా ఉంటుంది కాబట్టి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్‌లోనే జరుగుతుంది. కాబట్టి పిచ్ చాలా తాజాగా ఉండనుంది. దాంతో ఈ వికెట్‌పై బంతి ఎక్కువగా బౌన్స్ అయ్యే అవకాశం ఉందని వసీం అక్రమ్ తెలిపారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌కు డ్యూక్ బంతిని వాడుతుండటంతో స్వింగ్ కూడా ఎక్కువగా ఉండనుంది. ఎందుకంటే కూకబుర్ర కంటే డ్యూక్ బాల్ చాలా గట్టిగా ఉంటుంది. ఆసీస్ బౌలర్లు ఎక్కువగా బౌన్స్ వేసే అవకాశం ఉంది. స్వింగ్, బౌన్స్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఆసీస్ పేస్‌ను ఎదుర్కొవడం భారత బ్యాటర్లకు సవాల్‌తో కూడుకున్నదే.