బుమ్రాపై ప్రశంసలు కురిపించిన స్టీవ్ స్మిత్.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్ బౌలర్ అంటూ కితాబు

by Harish |
బుమ్రాపై ప్రశంసలు కురిపించిన స్టీవ్ స్మిత్.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్ బౌలర్ అంటూ కితాబు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీమ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. అన్ని ఫార్మాట్లలో బుమ్రా అత్యుత్తమ బౌలర్‌ అని మెచ్చుకున్నాడు. కొత్త బంతైనా, పాత బంతైనా అతను బ్యాటర్లకు సవాల్ విసురుతాడని తెలిపాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో స్మిత్ మాట్లాడుతూ..‘నేను ఎదుర్కొన్న బౌలర్లలో బుమ్రా అద్భుతమైన బౌలర్. కొత్త బంతైనా, కొంచెం పాత బంతైనా, పాత బంతైనా.. ఏ బాల్‌తోనైనా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అతనికి ఆ నైపుణ్యాలు ఉన్నాయి. అతను గొప్ప బౌలరే కాదు.. మూడు ఫార్మాట్లలో అత్యుత్తుమ ఫాస్ట్ బౌలర్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అతన్ని ఎదుర్కోవడం ఎల్లప్పుడూ సవాల్‌గానే ఉంటుంది.’ అని చెప్పుకొచ్చాడు. ఆసిస్ గడ్డపై 7 టెస్టులు ఆడిన బుమ్రా 32 వికెట్లు తీసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.

Advertisement

Next Story