- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫెదరర్, నదాల్, జకోవిచ్‌లను ఐస్‌క్రీంతో పోల్చిన బోపన్న
దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్‌లో రోగర్ ఫెదరర్, రాఫెల్ నదాల్, నోవాక్ జకోవిచ్‌లలో ఎవరు గ్రేట్ అంటే చెప్పడం కష్టమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్నకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి బోపన్న ముగ్గురి ప్రత్యేకతలను వివరిస్తూ సమాధానమిచ్చాడు. ‘కోర్టులో ఫెదరర్ గాంభీర్యం అద్భుతంగా ఉంటుంది. సొగసైన ఆట ఆడతాడు. మట్టి కోర్టులో నదాల్‌దే పూర్తి ఆధిపత్యం. జకోవిచ్ వ్యూహరచన చెస్ గ్రాండ్‌మాస్టర్‌ను పోలి ఉంటుంది. నా దృష్టిలో ముగ్గురు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం.’ అని చెప్పాడు.
ప్రతి ప్లేయర్‌కు వారి ప్రత్యేక ఆట తీరు ఉంటుందని, కాబట్టి, ఒక్కరిని ఎంపిక చేయడం కష్టమన్నాడు. ‘ఇది ఐస్‌క్రీంలో బెస్ట్ ఫ్లేవర్‌ను ఎంచుకోవడంలాగే ఉంటుంది. ఐస్‌క్రీంలో ప్రతి ఒక్కరికీ వారి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి స్కూప్ కాదనలేని రూపాన్ని, రుచిని కలిగి ఉంటుంది.’ అని ఫన్నీగా సమాధానమిచ్చాడు. కాగా, 44 ఏళ్ల వయసులో బోపన్న ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. లేట్ వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన అతను గత నెలలో మిమామి ఓపెన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
- Tags
- #Rohan Bopanna