Asian Games 2023: చైనా గడ్డపై భారత్‌కు గ్రాండ్ వెల్‌కం.. (వీడియో)

by Vinod kumar |   ( Updated:2023-09-26 04:42:41.0  )
Asian Games 2023: చైనా గడ్డపై భారత్‌కు గ్రాండ్ వెల్‌కం.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని హాంగ్‌జో వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల ఆరంభోత్సవాలు ఘనంగా జరిగాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ వేడుకలను ప్రారంభించారు. ఆ తర్వాత ఒక్కో దేశం తరఫు క్రీడాకారులు జాతీయ జెండాలతో వేదిక మీదకు వచ్చారు. భారత ఫ్లాగ్ బేరర్లుగా స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గెహెయిన్, హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత బృందాన్ని ముందుండి నడిపించారు. సంప్రదాయ వస్త్రధారణలో వీరు వేదిక మీదకు రాగానే కార్యక్రమం జరుగుతున్న స్టేడియం అంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. భారత అభిమానులు తమ బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. వీరి కరతాళ ధ్వనుల మధ్య భారత బృందం వేదిక మీదకు వచ్చింది.

ఫ్లాగ్ బేరర్ల మార్చ్‌కు ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. వీటి తర్వాత చైనా క్రీడాకారులు వేదిక మీదకు వచ్చారు. చైనా జాతీయ గీతం ముగిసిన తర్వాత ఆసియా క్రీడల మస్కట్‌లు వేదికపైకి వచ్చి ప్రేక్షకుల్లో హుషారు పెంచాయి. ఆ తర్వాత వరుసగా ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, హాంగ్‌కాంగ్, భారత్, ఇండోనేషియా, కిర్జికిస్తాన్, జపాన్ తదితర దేశాలకు చెందిన క్రీడాకరులు తమ జాతీయ జెండాలతో వేదికపైకి వచ్చారు. ముఖ్యంగా భారత క్రీడాకారులు వేదికపైకి వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లేలా ప్రేక్షకుల నుంచి ఆహ్వానం లభించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింగ కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధిస్తారని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ మధ్య చర్చలు మొదలైపోయాయి.

Advertisement

Next Story