- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Asian Games 2023: బాక్సర్ లవ్లీనాకు సిల్వర్ మెడల్..
దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన బాక్సర్ లవ్లీనా.. ఆసియా క్రీడల్లో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నది. 75కేజీల బౌట్ ఫైనల్లో ఆమె చైనా బాక్సర్ చేతిలో ఓటమిపాలైంది. 75 కేజీల విభాగంలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్లో ఆమె ఓడిపోయింది. దీంతో లవ్లీనా రజత పతకానికే పరిమితమైంది. రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన లీ క్వియాన్ చేతిలో లవ్లీనా పరాజయాన్ని చవిచూసింది. ఈ మెడల్‌తో బాక్సింగ్‌లో ఇండియా ప్రస్థానం ముగిసింది. భారతీయ బాక్సర్లకు ఈ సారి ఆసియా క్రీడల్లో అయిదు మెడల్స్ వచ్చాయి.
దాంట్లో ఒకటి సిల్వర్ కాగా మరో నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. బౌట్ ప్రారంభమైన క్షణం నుంచి చైనా బాక్సర్ లీ దూకుడుగా ఆడింది. పవర్ఫుల్ పంచ్‌లతో లవ్లీనాపై విరుచుకుపడింది. తొలి రౌండ్లో 3-2 తేడాతో చైనా బాక్సర్ ఆధిక్యాన్ని నిలుపుకున్నది. ఆ తర్వాత రెండో రౌండ్లోనూ చైనా బాక్సర్ దాడి చేసింది. ఈజీగా రెండో రౌండ్‌ను కూడా ఆమె గెలిచేసింది. ఫైనల్ రౌండ్లో కూడా క్వియాన్ దూకుడు ముందు లవ్లీనా నిలువలేకపోయింది.
SHINING SILVER🥈 FOR LOVLINA🌟
— SAI Media (@Media_SAI) October 4, 2023
🇮🇳's Boxer and #TOPSchemeAthlete @LovlinaBorgohai wins the SILVER 🥈medal in the Women's 75 kg category 🇮🇳🏅
Her incredible prowess in the ring shines brighter than ever. Let's give her a thunderous round of applause! 🥳💪
Congratulations,… pic.twitter.com/i0qSwfD51o