- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పెన్షనర్లకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కె. రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం మల్లు స్వరాజ్యం ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని, ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగుల ట్రెజరరీలో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేస్తామని, నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇంకా పీఆర్సీని, మంచి ఫిట్మెంట్ ను అమలు చేస్తామని ఎన్నికల టైంలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా హామీలు నెరవేర్చలేదని అన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నిజామాబాద్ అధ్యక్షులు శిర్ప హనుమాండ్లు, జిల్లా ఉపాధ్యక్షులు లావు వీరయ్య, కోశాధికారి ఈవీఎల్ నారాయణ, కార్యదర్శి ప్రసాద్ రావు పాల్గొన్నారు.
- Tags
- pensioners