హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం.. సీఎం నాయబ్‌సింగ్‌ సైనీకి ప్రధాని మోడీ అభినందనలు

by Shiva |   ( Updated:2024-10-08 10:49:02.0  )
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం.. సీఎం నాయబ్‌సింగ్‌ సైనీకి ప్రధాని మోడీ అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో మొదటి సారి జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకీ వ్యతిరేకంగా వచ్చినప్పటికి ఓట్ల లెక్కింపుతో హర్యానా రాష్ట్ర ప్రజల నిర్ణయం బహిర్గతమైంది. ఎవరూ ఉహించని విధంగా హర్యానలో బీజేపీ 50 కంటె ఎక్కువ స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుంది. ఇందులో ఇప్పటికే 38 స్థానాల్లో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో గతంలో కంటే ఈ సారి బీజేపీ మరో 11 స్థానాలు ఎక్కువ దక్కించుకుంది. ఈ విజయంపై ప్రధాని మోడీ స్పందించారు. హర్యానాలో 50 కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తున్నందుకు.. పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా.. హర్యానా సీఎం నాయబ్‌సింగ్‌కి ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. సీఎం నాయబ్‌సింగ్‌కి అభినందనలు తెలిపారు. మరోపక్క జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ ఎవరు ఉహించని విధంగా పుంజుకుంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లగా.. బీజేపీ గత ఎన్నికల్లో సాధించిన 25 సీట్ల కంటే ప్రస్తుతం.. మరో నాలుగు కలుపుకుని మొత్తం 29 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed