GATE-2025: గేట్-2025 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు..చివరి తేదీ ఎప్పుడంటే..?

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-08 12:45:59.0  )
GATE-2025: గేట్-2025 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు..చివరి తేదీ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్:దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌(M.Tech) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(GATE) -2025 పరీక్ష దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఐఐటీ రూర్కీ(IIT Roorkee) ఓ ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాగా గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు అక్టోబర్‌ 3వ తేదీనే ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియగా..తాజా నిర్ణయంతో అక్టోబర్‌ 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి.పరీక్ష ఫలితాలు మార్చి 19వ తేదీన విడుదల చేస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జనవరి 2వ తేదీ నుంచి gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed