Asia Cup 2023: ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీ.. పాల్గొనేందుకు ఆసక్తి చూపని బీసీసీఐ అఫీషియల్స్!

by Vinod kumar |
Asia Cup 2023: ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీ.. పాల్గొనేందుకు ఆసక్తి చూపని బీసీసీఐ అఫీషియల్స్!
X

న్యూఢిల్లీ : ఈ నెల 30 నుంచి మొదలయ్యే ఆసియా కప్‌‌కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహిస్తుండటంతో పాక్, శ్రీలంక వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ముల్తాన్ వేదికగా ఈ నెల 30న పాకిస్తాన్, నేపాల్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ఆయా దేశాల క్రికెట్ బోర్డు‌లకు ఇన్విటేషన్ పంపింది. అయితే, ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీకి బీసీసీఐ అఫీషియల్స్ దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతోపాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రెటరీ జై షా సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనాసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘పీసీబీ నుంచి మాకు ఇన్వెటేషన్ వచ్చింది.

అయితే, పాక్‌కు వెళ్లడానికి ఎవరూ ఇష్టం చూపించడం లేదు. ఆటగాళ్లకే కాదు.. పాకిస్తాన్‌లో పర్యటించడానికి బోర్డు అధికారులకు కూడా భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి క్లియరెన్స్ రాలేదు.’ చెప్పారు. కాగా, ఆసియా కప్‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియాను పాక్‌కు పంపించమని బీసీసీఐ స్పష్టం చేయడంతో.. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story