Asia Cup 2023: గెలుపు జోష్‌లో ఉన్న శ్రీలంకకు బిగ్ షాక్‌.. ఫైనల్‌కు స్టార్‌ స్పిన్నర్‌ ఔట్!

by Vinod kumar |
Asia Cup 2023: గెలుపు జోష్‌లో ఉన్న శ్రీలంకకు బిగ్ షాక్‌.. ఫైనల్‌కు స్టార్‌ స్పిన్నర్‌ ఔట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023 ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. తొడ కండరాలు పట్టేయడంతో అతడు నొప్పితో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు గురువారం రాత్రి వెల్లడించింది. స్కానింగ్‌ కోసం శుక్రవారం అతడిని ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపింది. కాగా తుది పోరుకు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన వన్డే మ్యాచ్‌లో అసాధారణ పోరాటంతో 2 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన హొరాహోరీ పోరులో పట్టుదలగా పోరాడి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌ సందర్భంగానే లంక యువ స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణకు గాయమైంది. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో కుడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ తన స్పెల్‌ పూర్తి చేశాడు.

Advertisement

Next Story